kudali

Wednesday, July 4, 2012

కోతుల తెలివి


మనుషులకంటే కోతులకు బిజినెస్ తెలివితేటలు ఉంటాయని పుస్తకంలో చదివి ఒక వ్యక్తి ఒక కోతిని కొని బిజినెస్ లో దాని సలహాలు తీసుకోవాలని దానికి తెలుగు( ఒక భాష ) నేర్పించాడు .....

తెలుగు మొత్తం వచ్చాక మొదట ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని కోతిని అడిగాడు ....
bet కట్టే business తో మొదలుపెడితే బాగుంటుందని కోతి చెప్తుంది ...ఎలా చెయ్యాలో అంతా చెప్తుంది ..

ఆ తరువాత రోజు ఆ వ్యక్తి మార్కెట్ లో ఉండి " నా కోతి మాట్లాడుతుంది .." అని అరుస్తూ ఉంటాడు. అందరూ వచ్చి చాల్లే చెప్పొచ్చావు అని విసుక్కున్తుంటే ... ఒకవేళ కోతి మాట్లాడకపోతే నేను మీకు మీరు ఈ కోతి మీద ఎంత bet కడతారో అంతకు డబల్ డబ్బులు ఇస్తాను " అని చెప్తాడు ...ఒకవేళ కోతి మాట్లాడితే మీరు ఎంత bet కడతారో అది నాకే అని అంటాడు ..

Concept ఆసక్తికరంగా వుందని అందరూ bet కడతారు. .ఒకరు 5 , మరొకరు 10 రూపాయలు అలా ఎవరికీ తోచిన amount వాళ్ళు కడతారు ...

అప్పుడు కోతిని మాట్లాడమని వ్యక్తి అడుగుతాడు . కాని కోతి ఏమి మాట్లాడదు. ఎంత మాట్లాడమని అడిగినా కోతి మాత్రం మాట్లాడదు.. ఇక గత్యంతరం లేక ఆ వ్యక్తి అందరికి డబల్ డబ్బులు ఇస్తాడు , ...

ఇంటికి విచారంతో తిరిగి వచ్చిన వ్యక్తితో కోతి అంటుంది రేపు మల్లి same ప్రకటన చేయి మార్కెట్ లో అంటుంది ... తిరిగి వ్యక్తి అదే ప్రకటన ,మళ్లి కోతి మౌనం , నష్టం ..... డబల్ డబ్బులు ... ప్రజలకు డబ్బులు ...

అలా 10 రోజులు గడిచాయి ... ప్రజల్లో concept చాలా interest అయిపొయింది ..నోటి మాట ద్వారా పక్క వూరి నుంచి జనాలు కూడా వచ్చారు..

మళ్లి యధావిధిగా వ్యక్తి same ప్రకటన ... ఈ సారి జనాలు ఇళ్ళు, వాకిలి ,పొలం,నగా అన్ని bet లో పెట్టి కళ్ళుమూసుకొని అన్ని డబల్ వస్తాయని అనుకొంటారు ..
కాని ఈ సారి కోతి ధారాళంగా మాట్లాడడమే కాకుండా రెండు హిట్ పాటలు పాడి వినిపిస్తుంది..

అప్పుడు జనాలు లబోదిబో ... వ్యక్తి అందరి దగ్గర నుంచి అన్ని తీసుకొని world టూర్ ....

మిత్రులారా ....
ఆ తరువాత ఈ concept కొంచెం implement అయి Share మార్కెట్ ,Forex ,Stocks ,మార్కెట్లోకి వచ్చాయి ....
ఈ విషయములో నేను ఏమీ చెప్పను ... విషయము అర్థం చేసుకొమ్మని విన్నవించు కుంటున్నాను ..

2 comments: