kudali

Monday, November 8, 2010

న్యూస్- పోలిటిక్స్- సాంఘీక శాస్రము..

నేను ఈ మధ్యన న్యూస్ చానల్స్ చూడటం పూర్తిగా మానేసాను. ఎందుకంటే ఒక విషయాన్నీ గురించి సీరియల్ కన్నా ఎక్కువగా సాగదీయడం నేర్చుకున్నారు మన చానల్స్ వాళ్ళు. నాకు అసలు chewing gum సీరియల్ చూడటమే నచ్చదు. అలాంటిది అంత కన్నా సాగదీసే న్యూస్ చానల్స్ చూస్తానా. నో వే.... కానీ దాని ప్రభావం వల్ల అసలు బయటి లోకం లో ఏం  జరుగుతుందో తెలియడం లేదు. అసలు పోలిటిక్స్ గురించి నాకు  యిప్పటికీ ఏమి తెలియదు. అంటే కొన్ని తెలుసు మన ముఖ్య  మంత్రి ఎవరు..? లాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానాలు తెలుసనుకోండి. అయ్యో మరీ అలా చప్పట్లు కొట్టేస్తున్నారా.. ఏదో అంతా మీ అభిమానం.... ఈ విషయం మన మద్యనే ఉంచండి. బయటికి తెలిస్తే మళ్లీ ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు నా ఇంటర్వ్యూ కోసం వచ్చేస్తారు..
 
     మీకు ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నానంటే, పోలిటిక్స్ కి, నాకు మధ్యన లక్ష్మణ రేఖ గీసిన ఆ సాంఘీక శాస్త్రంతో నేను పడ్డ బాధల గురించి చెప్దామని..

    అసలు నేను చిన్నప్పటి నుండి ఆ సాంఘీక శాస్త్రం(social) లో వీక్.  దాని పర్యవసానమే ఇప్పుడీ పోలిటిక్స్ అంటేనే నచ్చవు. స్కూలింగ్ లో ఐతే ముఖ్య మంత్రి పేరు తప్ప ఎవరూ తెలేసేది కాదు. ఆ క్లాసు లో ఎప్పుడూ నిద్ర పోతూ నా ఊహలోకం లో ఉండేదాన్ని.  కానీ మార్కులు మాత్రం ఎప్పుడూ 90 కి తక్కువ వచ్చేవి  కావు.  అంటే రాసేదాన్ని కానీ చదివేటప్పుడు మాత్రం తల ప్రాణం మెదడు దగ్గరికోచ్చేది.( అంటే నా ఫ్రెండ్స్ ఎప్పుడూ నా మెదడు మోకాళ్ళలో ఉందని పొగిడేవారు). అంత కష్టపడి చదవడం దేనికి అంటారా.. అమ్మో మా నాన్న.. అన్నింటికీ మించి స్కూల్ లో పరువు నిలుపుకోవాలిగా మరి.. అన్ని సబ్జక్ట్స్ లో మనం ఫస్ట్ మరి.. ( అంటే ఇంగ్లీష్ తప్ప.. దాని గురించి ఇంకో పోస్ట్ లో రాస్తా.. దానిది దీనికంటే పెద్ద పురాణం.. )

     నేను చిన్నప్పటి నుండి అల్లరి పిల్లని.. మమూలుగా కాదు.. మా క్లాసు టీచర్ రాకపోతే నా గొంతు పక్క క్లాసు కి వినపడేది. ఎంత అల్లరి చేసిన మా టీచర్స్ కి నేనంటే ఒక softcorner  ఉండేది. అది కూడా నేను బాగా చదివే స్టూడెంట్ అని. 8 , 9 క్లాసు వరకైతే  మా నాన్న వచినప్పుడల్లా కంప్లైంట్ మన మీద.. " సర్, మీ అమ్మాయి బాగా చదువుతుంది కానీ ఇంకా బాగా అల్లరి చేస్తుంది" అని. నాకు భయమేసేది.. కానీ ఇంటికొచ్చిన తరువాత " ఏంటి బాగా అల్లరి చేస్తావంట" అని, ఒక నవ్వు నవ్వేవారు.. అంతే మనం కూడా ఒక నవ్వు నవ్వి బయటికి పరార్.. మళ్లీ ఎక్కడ తిడతారో అనే భయంతో..

    ఆ సాంఘీక లో నాలుగు భాగాలూ ఉంటాయి కదా..  దాంట్లో ఆ geography  కొంచెం పర్వాలేదన్నట్లుగా ఉండేది.. కానీ చరిత్ర (history) కొచ్చేసరికి.. ఓహ్... ఏమని వర్ణించను నా పాట్లు.. ఎవరో ఎవరి కోసమో యుద్ధం చేస్తే అది నేనెందుకు చదవాలో.. మళ్లీ దాన్ని అన్నీ తెలిసి, రోజూ మా బుర్రలతో రోజు నాన్-వెజిటేరియన్ భోజనం చేసి, మమ్మల్ని నిద్ర పుచ్చే మా సోషల్ టీచర్ కోసం రాయడం ఏంటో అని, సోషల్ ని కనిపెట్టిన వాడిని ఏదో నా రేంజ్ లో తిట్టుకుంటూ ఎలాగోలా గట్టేక్కేసేదాన్ని.. మరీ మన మీద ఎవరో కక్ష్య కట్టడం కాకపోతే ఆ యుద్దం జరిగిన సంవత్సరం ని కూడా  కరెక్ట్ గా  రాయమనేవాడు మా సోషల్ సర్.. ఏంటి రాసేది..  నేను ఆ యుద్ధం పేరు ని గుర్తు పెట్టుకోవడమే మహా గొప్ప.. అయినా మన గొప్పలు మనం చెప్పుకోకూడదు కదా.. సో.. ఆపేస్తున్నాను..

  ఇక పౌర శాస్త్రానికొస్తే , ఇది మరీ చరిత్ర అంత కాకపోయినా దాని రేంజ్ లో అది దానికి తోచినంత, చేతనైనంత ఏడిపించేది నన్ను.. అప్పట్లో మాకు టెన్త్ క్లాసు లో రాజేష్ సర్ అని, సోషల్ చెప్పేవారు. పాపం చాలా మంచోడు లెండి. ( నేను ఎంత అల్లరి చేసిన ఏమి అనేవాడు కాదు).  ఆయన ఎక్కువగా పౌర శాస్త్రం క్లాసు లే  చెప్పినట్టు గుర్తు. మరి నేను సోషల్ క్లాసు లో  ఎప్పుడూ నా ఊహ లోకం లో ఉండేదాన్ని కదా.. అక్కడి నుండి రాగానే ఈయన నాకు పౌర హక్కు ల పాట పాడుతూ స్వాగతం చెప్పేవారు.. అందుకే నాకలా అనిపించిందేమో..


   ఇక అర్ధ శాస్త్రానికొస్తే, నాకు అంతో ఇంతో నచ్చింది ఇదేనండి.. ఎందుకంటే చాలా తక్కువ చాప్టర్స్ ఉండేవి దీంట్లో.. సో.. చదివేసి  ఫుల్ గా చింపేసేదాన్ని.. ఏదో నా అదృష్టం బాగుండి ఇంటర్ లో మాథ్స్ సబ్జెక్టు తీసుకున్నాను గానీ.. పొరపాటున ఏ  సివిక్సో లేక హిస్టరీ నో తీసుకుంటే యిప్పటికీ ఆ ఇంటర్ కాలేజీ లో నే ఫ్రేషేర్స్ పార్టీ కి వెళ్ళేదాన్ని( సారీ వెళ్తూనే ఉండేదాన్ని)..  ఇప్పుడు ఈ మాథ్స్ తీసుకుని చాలా హ్యాపీ గా ఉన్నాను... హమ్మయ్య...

Sunday, November 7, 2010

సినిమా సమీక్ష

     బృందావనం సినిమా చూసి వచ్చిన మా ఫ్రెండు, దీప్తి "సినిమా చాలా బాగుంది, మళ్లీ వస్తానే నీతో"  అనేసరికి నిజంగానే రెండో సారీ చూసేంత రేంజ్ లో ఉందేమో అనుకుని ఒకానొక శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకుని, ఆ ముహూర్తానికి ఒక 15 నిముషాలు ఆలస్యంగా వెళ్లి కూర్చున్నాం సినిమా హాల్ లో.. అప్పటికే ఒక సాంగ్ ఐపోయింది.. కొంచెం సేపటి వరకు బాగానే అనిపించింది.. కానీ.. కొంచెం సేపటి తరువాత,, సినిమా లో నెక్స్ట్ వచ్చే సీన్ ముందే ఊహిన్చెయ్యొ చ్చు  అనిపించింది. పాత స్టొరీ నే కానీ కొంచెం కొత్తగా చూపించాలనుకున్నాడు డైరెక్టర్. కథ విషయానికొస్తే, అది బావగారు బాగున్నారా అండ్ కొన్ని పాత సినిమాల( ఇద్దరు హీరోఇన్స్, ఒక హీరో ఉన్న సినిమాలు)  కథలని కలిపి కొంచెం changes చేసి తయారు చేసిన కథ అది. కథలో కొత్తదనం ఏమి లేదు.  కొన్ని సీన్స్ లో కాజల్ ని సమంతా గ్లామర్ డామినేట్ చేసింది. కాజల్ నవ్విన సీన్స్ కంటే ఏడ్చిన సీన్స్ ఎక్కువ.   కానీ జూ. ఎన్టీఆర్, కాజల్, సమంతా బాగున్నారు.. కానీ సినిమా చూసేటప్పుడు బోర్ కొట్టదు.  (చూసిన తరువాత కొట్టొచ్చు).  కానీ ఈ సినిమా నే మన టీవీ ఛానళ్ళు హిట్టు సూపర్ హిట్టు బంపర్ హిట్టు అని పొగిడేస్తున్నారు..నిజానికి అంత రేంజ్ లో ఏమి లేదు. కానీ సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి చూసేలా ఉంది సినిమా.. ఈ మద్యన అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి కదా.. సూరీడే సాంగ్ నాకు బాగా నచ్చింది.. మిగతావి అంత effective గా ఏమి లేవు..

     ఈ సినిమా కి ఖలేజా ఫ్లాప్ అవ్వడం ప్లస్ ఐంది.. నిజానికి ఖలేజా అంత వరస్ట్ గా ఏమి లేదు.. ఫస్ట్ హాఫ్ హాయిగా నవ్వుకోవచ్చు. నాకితే మహేష్ బాబు సినిమా లో చాలా మాట్లాడితే, ( అంటే రవితేజ లాగా.. మరీ బాలకృష్ణ లా కాదనుకోండి..) చూడాలని ఉండేది. ఖలేజా చూసిన తరువాత ఆ కోరిక తీరిపోయింది. కానీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది.. రెండు పాటలు బాగున్నాయి.. ఈ సినిమా లో కొన్ని సీన్స్ చూస్తె మగధీర సినిమా గుర్తుకొచ్చింది. ఆ సినిమా చూసి కాపీ కొట్టారు అనుకున్నాను. కానీ నిజానికి జరిగింది ఏంటయ్యా అంటే, ఖలేజా లో సీన్స్ గురించి సునీల్ మాటలమధ్యలో రాజమౌళి కి చెప్పాడంట.. అది విని రాజమౌళి వాటిని తన మగధీర లో వాడుకున్నాదంట. అందుకే సునీల్ కి మర్యాద రామన్న ఛాన్స్ ఇచ్చాడంట. ఇది తెలిసిన త్రివిక్రమ్ గారు సునీల్ క్యారెక్టర్ ని ఫస్ట్ హాఫ్ కే పరిమితం చేసేశారు. ఇంకా అనుష్క అందం మహేష్ ముందు వెల వెల బోయినట్లుగా ఉంది..

     ఈ మద్యన చూసిన మూవీస్ లో బెస్ట్ అంటే రోబో. బాగుంది. ఐష్ సూపర్బ్ గా ఉంది. క్లైమాక్స్ లో ఆ formations కొంచెం ఎక్కువయ్యాయి అనిపించింది. క్లైమాక్స్ కొంచెం సాగదీసాడు..  కానీ ఓవరాల్ గా movie was good.

     ఇంకా ఈ మద్యన చూసిన మూవీస్ లో వరస్ట్ అంటే పులి. ఆ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే మన ఆరోగ్యానికి అంత మంచిది.. కానీ నేను త్యాగశీలి ని కదండీ.. కాబట్టి మీ కోసం కొంచెం సేపు నా ఆరోగ్య సూత్రాలను పక్కన పెడుతున్నాను.. ఈ సినిమా కి మా పెద్దన్న, చిన్నన్న, లచ్చి బావ ( లక్ష్మణ్ ని మేము అలా పిలుస్తాం లెండి), రంజిత్ అన్నయ్య వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే .. మూవీ చూసి కాదండోయ్.. మా చిన్నన్న, బావ చేసే కామెంట్స్ కి.. నిజంగా అంత చెత్త సినిమా నేను ఇప్పటివరకు చూడలేదేమో.. పవన్ కళ్యాన్ dialogues మొదలు పెడితే ఎప్పుడూ ఆపుతాడా అని ఎదురు చూసాము.. స్టొరీ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ ఐంది. హీరోయిన్ సాంగ్స్ కే పరిమితం. విలన్ ని చూపించే విధానం సరిగ్గా లేదు.. క్లైమాక్స్ వచ్చాక కాసేపటికి కానీ అర్ధం కాలేదు అది క్లైమాక్స్ అని. ఈ చెత్త సినిమా కోసం 3 గంటలు నిద్ర వేస్ట్ చేసుకొని మరీ వెళ్ళాం. నిద్ర వేస్ట్. సినిమా వరస్ట్.  కొన్ని సీన్స్ లో ఐతే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ని మించిపోయాడు.. ఫస్ట్ సీన్ లో కొన్ని జంప్స్ చేస్తాడు.. క్రిష్ సినిమా లో హృతిక్ కూడా అన్నీ చేయలేదేమో.. సాంగ్స్ వింటూ వింటూ ఉంటే ఓకే అనిపించాయి..
    కొన్నిసాంగ్స్ లో lyrics అర్ధం కాలేదు.. అయినా A.R.రెహమాన్ సంగీతం లో భాష, భావం వెదకడం అంటే సముద్రం లో మంచి నీటి కోసం వెదకడం లాంటిదేమో అని నా ఫీలింగ్.. అవి ఉంటాయేమో కానీ నాకు అంతగా నచ్చదు. అతని సంగీత సారధ్యం లో సాహిత్యానికి విలువ ఉండదు అని నా ఫీలింగ్.. ఇక్కడ రెహమాన్ అభిమానులు ఉంటే సారీ.. కానీ మ్యూజిక్ బాగుంది...

Monday, November 1, 2010

తొలి అడుగు

మొదటి సారిగా బ్లాగ్ ని ప్రారంభించాను. కానీ ఏం రాయాలో అర్ధం కావడం లేదు. ఏదైనా  తప్పులు ఉంటె పాపం చిన్న పిల్ల అని నా తొలి అడుగుని  పెద్ద  మనసుతో క్షమించగలరు... అందరి బ్లాగ్స్ ని చూసి చదివి (ఏదో ఆవేశమో ఏంటో నాకు తెలియదు) నాకు కూడా ఒక బ్లాగ్ ని ప్రారంభిద్ద్దామని అనిపించి తడబడుతూ create చేశాను.. నాకు అందరి wishes కావాలె మరి. ఉంటాను మరి ఇప్పటికి... మల్లి కలుస్తానే....